ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
ధైర్యంగా ఉండండి… అండగా నేనుంటా…

ధైర్యంగా ఉండండి… అండగా నేనుంటా…
ఈ పోరాటంలో గెలిచేది మనమే
పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు
బోయనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేఈ శ్యామ్ బాబు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 06, (సీమకిరణం న్యూస్) :


ఈ ఎన్నికల పోరాటంలో గెలిచేది మనమే ధైర్యంగా ఉండండి అండగా నేనుంటానని పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు పేర్కొన్నారు. శనివారం వెల్దుర్తి మండలంలోని బోయనపల్లి గ్రామంలో బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారెంటీ ( సూపర్ 6) పై కేఈ శ్యామ్ బాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. కేఈ శ్యామ్ బాబుకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కేఈ శ్యామ్ బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. యువతకి రైతులకు మంచి భవిష్యత్తు కావాలి అంటే అది బాబు వల్లే అవుతుందన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను వారు విజ్ఞప్తి చేశారు. 2024 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రిగా చెయ్యాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండలం చెందిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు మరియు బోయనపల్లి గ్రామ స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.