జనసేన ఆవిర్భావ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యండి
గుంటూరులో జరిగే ఆవిర్భావ సభ కార్యక్రమం జయప్రదం చేయండి
ఇందుకూరుపేట జనసేన పార్టీ మండల కన్వీనర్ గుడి హరికుమార్ రెడ్డి
నెల్లూరు, ఇందుకూరు పేట, మార్చి 13, (సీమకిరణం న్యూస్) :
జనసేన ఆవిర్భావ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇందుకూరుపేట జనసేన పార్టీ మండల కన్వీనర్ గుడి హరికుమార్ రెడ్డి జన సైనికులకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని గంగపట్నం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భవించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు చెన్న మనక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 14వ తేదీ సోమవారం గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు నెల్లూరు నుండి జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా జనసేన కార్యకర్తల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మలిదశ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నెల్లూరు జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన ప్రతి జనసైనికులకు ధన్యవాదాలు తెలిపారు. యువత ముందుకు వచ్చి సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలకాలనీ పిలుపునిచ్చారు. కొత్త రక్తం రాకతో రాజకీయ ప్రక్షాళన జరిగి నవతరానికి నాంది పెరుగుతుందన్నారు. జనసైనికులకు
ఏ కష్టమొచ్చినా జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి అశ్వక్, ఉపాధ్యక్షులు చెముకుల సుమన్, ప్రధాన కార్యదర్శి మారుతి రెడ్డి, సీనియర్ నాయకులు మాధవ రెడ్డి,కలిల్ తదితరులు పాల్గొన్నారు.