సలామ్ మియా ఇంటికి ఎమ్మెల్యే శ్రీదేవి
సలామ్ మియా ఇంటికి ఎమ్మెల్యే శ్రీదేవి
మద్దతుతో పాటు ఓటు వేయాలని కోరిన ఎమ్మెల్యే
తేనేటి విందు స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీదేవి
షబ్బే బరాత్ (పెద్ద రాత్రి) పండగ సందర్భంగా ముస్లిం మైనార్టీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీదేవి
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 06, (సీమకిరణం న్యూస్) :
ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్దుర్తి పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు సలాం సప్లయర్స్ యజమాని సలామ్ మియా ఆహ్వానం మేరకు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆయన ఇంటికి వెళ్లి తేనేటి విందు స్వీకరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని ఎమ్మెల్యే గా తనకు ఎంపిగా బివై రామయ్య కు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వెయ్యాలని అలాగే అందరితో ఓటు వేయించాలని ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు. అనంతరం వెల్దుర్తిలోని ముస్లిం మైనార్టీ ప్రజలకు రంజాన్ నెల షబ్బే బరాత్ (పెద్ద రాత్రి) పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.