మీలో ఒకడిగా… మీకు అండగా ఉంటా
ఓటుతో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలి
పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 10, (సీమకిరణం న్యూస్) :
ముస్లిం మైనార్టీ సోదరులారా ఒకసారి ఆలోచించాలని…మనకు ఆలోచించాల్సిన సమయం వచ్చింది కనుక ఓటుతో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు ముస్లిం మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేఈ శ్యామ్ బాబు మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలో వున్న ముస్లీంలందరికీ ఓటు రూపంలో ఇప్పుడు మంచి అవకాశం దొరికిందని, ఇన్నాళ్లూ ఓట్ల కోసం ముస్లీంలను వాడుకుని మోసం చేసిన వైయస్సార్ నాయకులకు తగిన గుణపాఠం ఓటు ద్వారా నేర్పాలని పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు తెలిపారు. వైయస్సార్సీపి పార్టీ గెలిచిన తర్వాత నుండి ఇప్పటి వరకూ ముస్లీంల కోసం ఏమీ చేయలేదన్నారు. వైయస్సార్ ప్రభుత్వంలో ముస్లీంలు తీవ్రంగా నష్టపోయారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పేద ముస్లీంలు పండుగను సంతోషంగా జరుపుకునేందుకు రంజాన్ తోఫా ఇచ్చేవారని గుర్తు చేశారు. అంతేకాకుండా ముస్లీం ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం రూ. 50 వేలు ఇచ్చేవారని, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రంజాన్ తోఫా తీసివేసి పేద ముస్లింలకు చాలా ఇబ్బందికరంగా పరిస్థితి తెచ్చి పెట్టారన్నారు, దుల్హన్ పథకం ద్వారా రూ. లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ముస్లీం చెల్లెమ్మల పెళ్లిళ్లకు డబ్బులు ఇవ్వాలంటే చదువుకొని ఉండాలనే కొత్త కండిషన్లు పెట్టారన్నారు. మొత్తం మీద ఎటు చూసినా ముస్లీంలు తీవ్రంగా అన్యాయమై పోయారన్నారు. ముస్లీం ఓట్లతో గెలిచిన నాయకులు ఏ రోజూ ముస్లీంల పక్షాన నిలబడి ఈ విషయాలపై ప్రభుత్వంలోని పెద్దలతో మాట్లాడి ముస్లీంలకు న్యాయం చేయలేదని కేఈ శ్యామ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానం తీసివేయడం వల్ల ముస్లీంలలో అత్యధికంగా గౌండా పనులు, సెంట్రింగ్ పనులు చేసుకుంటున్న వారి జీవితాలు రోడ్డున పడేలా చేశారని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చి మళ్లీ మీ అందరి జీవితాలు బాగుండేలా చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోబోతున్నారన్నారు. ఇక పత్తికొండ నియోజకవర్గంలో ముస్లీం అక్క చెల్లెమ్మలతో పాటు అన్నలు, యువకులు తెలుసుకోవలసిన విషయం ఏమంటే ఎన్నికల సమయంలో నాయకులు మీ ఇళ్ల వద్దకు వచ్చి కులం, మతం పేర్లు చెప్పి ఓట్లు అడగడం చేస్తారు. కానీ ముస్లింలకు చిత్తశుద్ధితో మేలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే మీరు ఒక్క విషయం గుర్తించాలని కేఈ శ్యామ్ బాబు అను నేను విన్నవిస్తున్నానని మంచి చేయడమే తప్ప ఎవ్వరినీ మోసం చేయడం మాకు తెలియదన్నారు. తనను నమ్మి ఒక్క అవకాశం ఇచ్చి నాకు ఓటు వేయండని మంచి అభివృద్ధి తీసుకొచ్చి మీ సోదరుడిగా మీలో ఒకడిగా మీకు అండగా ఉంటానని కేఈ శ్యామ్ బాబు అన్నారు . ధరలు పెంచి, పన్నులు పెంచి, సమస్యలు పెంచిన ఈ ప్రభుత్వానికి పొరపాటున కూడా ఓటు వేయవద్దన్నారు. ఏ వీధికి వెళ్లినా ఇబ్బందులే కనిపించేలా పరిపాలిస్తున్న ఈ వైయస్సార్ నాయకత్వాలను ఇక నమ్మడం మానేయండన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పత్తికొండ నియోజకవర్గానికీ మేలు చేసేందుకు కంకణం కట్టుకున్న నన్ను గెలిపించి మంచి అభివృద్ధికి సహకరించాలని కేఈ శ్యామ్ బాబు కోరారు.