వృద్ధులకు వికలాంగులకు అవోపా వారి చేయూత
వృద్ధులకు వికలాంగులకు అవోపా వారి చేయూత
కర్నూలు టౌన్, మార్చి 13, (సీమకిరణం న్యూస్) :
అవోపా కర్నూలు వారి ఆధ్వర్యంలో యోజన ఆసరా అను కార్యక్రమం కింద కీర్తిశేషులు కాల్వ సూర్యనారాయణ గుప్త గారి కుటుంబ సభ్యులు అందించిన ఆర్థిక సహకారంతో ఆదివారం ఉదయం గోశాల ప్రాంగణంలో 110 మంది ఆర్యవైశ్య వృద్ధులు వికలాంగులు మరియు వితంతువులకు ఒక్కొక్కరికి 600 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు గోనూరు యుగంధర్ శెట్టి అధ్యక్షత వహించగా దాతలు కాల్వ ప్రసాద్ గారి చేతుల మీదుగా సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కార్యదర్శి టి వి రత్న ప్రసాద్ , చీఫ్ కన్వీనర్
మలిపెద్దు నాగేశ్వరరావు, కార్యదర్శి పోలేపల్లి శేషయ్య ,పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. అవినాష్ శెట్టి, సభ్యులు పుల్లా ఆంజనేయులు, చిన్ని పాండురంగ,నాగెళ్ళ హరికిషన్, విష్ణువర్ధన్ గుబ్బా వెంకటరమణ నాగరాజు, రామ లక్ష్మయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.