దూదేకులను అవమానకరంగా చూస్తే అట్రాసిటీ కేసు
జీవో కల్పించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు
ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక
రాష్ట్ర నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు,మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షెక్సాయి భాజీ
ఎమ్మిగనూరు ప్రతినిథి, ఏప్రిల్ 13, (సీమకిరణం న్యూస్) :
దూదేకులను అవమానకరంగా చూస్తే అట్రాసిటీ కేసు నమోదు చేసే విదంగా జీవో కల్పించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. శుక్రవారం స్థానిక వైసిపి కార్యాలయంలో మీడియాతో ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక, రాష్ట్ర నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు షెక్సాయి భాజీ మాట్లాడారు. సమాజంలో దూదేకులను అవమానకరంగా పింజరి, సగం సాయిబు, లద్దాపు అని ఇతర కులాలు, మస్జీద్ లలో రకరకాలుగా మాట్లాడుతూ మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడేవారని మామనోభావాలను గౌరవిస్తూ 11వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి దూదేకులను అవమానకరంగా చూస్తే అట్రాసిటీ కేసు నమోదుకు జీవో కల్పించారు. భవిష్యత్తులో కూడా మాకు ఇండియన్ ముస్లిం దూదేకుల అని సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. అలా జీవో ఇస్తే పూర్తి మైనారిటీలుగా ఉంటామని, అలాగే సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఇటువంటి పని కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలరు. మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, ఎంఎల్ఏ అభ్యర్ధిగా బుట్టా రేణుకను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామని తెలిపారు. అలాగే ఎమ్మిగనూరు పట్టణంలో ఎంఎల్ఏ అభ్యర్ధి బుట్టా రేణుక, మున్సిపల్ వైస్ చైర్మన్ డి.నజీర్అహ్మద్ అధ్వర్యంలో ఏప్రిల్ 27వ తేదీన దూదేకుల గర్జన సభ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుట్టా నీలకంఠ,మున్సిపల్ వైస్ చైర్మన్ డి.నజీర్అహ్మద్,దూదేకుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.