సానుభూతి కోసమే గులక రాయి డ్రామా

సానుభూతి కోసం గులక రాయి డ్రామా
పత్తికొండ ఉమ్మడి కూటమి అభ్యర్థి కె.ఈ.శ్యామ్ కుమార్
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్) :
ఎన్నికల్లో సానుభూతి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గులక రాయి డ్రామాకు తెరలేపారని పత్తికొండ ఉమ్మడి కూటమి అభ్యర్థి కె.ఈ.శ్యామ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్ రెడ్డి ప్రజలకు చెప్పుకోవడానికి ఒక మంచి పని చేయలేదు. అనుభవ రాహిత్యం, అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఐదేళ్లలో ఒక పరిశ్రమ తేలేదు ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు రాష్ట్ర పురోగతిని సైతం బలి ఇచ్చారు అరాచకత్వంతో ఆంధ్రప్రదేశ్ ను అగాధములకు నెట్టారని ఇప్పుడు జగన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవడంతో కొత్త డ్రామా తెరలేపారు, గొడ్డలి వేటు కోడి కత్తి డ్రామాలు అయిపోయాయి ఇప్పుడు గులకరాయి డ్రామా జగన్ తెరలేపారు. నాలుగు రోజుల్లో సంచలనమైన సంఘటన జరుగుతుంది ఎన్నికల మూడ్ ను మార్చేస్తుందంటూ వైసీపీ నేత అవుతు శ్రీధర్ రెడ్డి చెప్పిన నాలుగో రోజు ఈ గులకరాయి సంఘటన జరగటం ఈ డ్రామాలో భాగం కాదా ?రాత్రి 7 గంటల నుంచి కరెంటు తీసేయడం 8 .10 కి దాడి ఘటన అంటూ ప్రచారం చేయటం రాత్రి 11 గంటలకు కుటుంబ సమేతంగా ఆసుపత్రికి వెళ్లడం ఇదంతా మీ సానుభూతి నాటకాలు కాదా ఘటన జరిగిన నాలుగు నిమిషాలకే క్యాట్ బాల్తో ఉపయోగించారు.
వారి బులుగు మీడియాకు జగన్ సోషల్ మీడియాకు ఎలా తెలుసు? డ్రామా జరిగినప్పుడు చుట్టూ ఉన్నది వైసీపీ కార్యకర్తలే పోలీసులు మరి నిందితుడిని ఎందుకు పట్టుకోలేకపోయారు ?
మీరు చేయించుకున్న కుట్ర కాబట్టే పట్టుకోలేదు క్యాట్ బాల్ తో దాడి జరిగితే సరిగ్గా ఎలా కనుబొమ్మపై తగులుతుంది?
ప్రజలు అమాయకులు కాదు విజయవాడ సి పి వైఫల్యమా? లేక కుట్రలో భాగస్వామ్యం?
గుర్తుతెలియని వ్యక్తి రాళ్లతో విసుగుతుంటే భద్రత వలయం ఏమైంది ?
విజయవాడలో సీఎం పర్యటనలో ఎందుకని మూడు గంటలు కరెంట్ కొత్త నిర్వహించారు ?
సీఎం పర్యటన ప్రాంతానికి కరెంటు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందా ?
చీకట్లో జగన్ రోడ్ షో ఎలా అనుమతించారు? ఇది ముందస్తు కుట్రలో భాగం కాదా?
జగన్ గారు గొడ్డలి గుడి కత్తి అయిపోయాయి ఇప్పుడు క్యాట్ బాల్ డ్రామా మొదలుపెట్టారు ?
యాత్రకు ప్రజా స్పందన కరువైంది బస్సు యాత్ర తుస్సుమన్నది ప్రజా వ్యతిరేకత ఈ సానుభూతి నాటకం సాక్షి బులుగు మీడియా నందు పుంఖాలు పుంఖాలు గా కథనాలు వస్తున్నాయి. మీ డ్రామాలు ప్రజలు నమ్మే రోజులు పోయాయి మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేఈ శ్యాం కుమార్ అన్నారు.