స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి
స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి
ఛైర్ పర్సన్ సుప్రజామురళీ
నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, మార్చి 13, (సీమకిరణం న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్
మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన స్పందన వేదిక ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ఛైర్ పర్సన్ సుప్రజామురళీ పేర్కొన్నారు. కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయితీ కార్యాలయంలో ప్రతీ సోమ
వారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వివిధ సమస్యలకు సత్వర పరిష్కారం పొందాలని ఛైర్ పర్సన్ ఆకాంక్షించారు.ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు
స్పందనలో ఒకసారి స్వీకరించిన సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని,సమస్య
పునరావృతం కాకుండా అధికారుల నుంచి
సిబ్బంది వరకు కృషి చేస్తున్నారని తెలిపారు. స్పందనలో ప్రజలనుంచి అందుకున్న అర్జీలకు వేగవంతమైన పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.