POLITICSSTATETELANGANAWORLD

గుర్తుపెట్టుకో జగన్….గెలిచేది తెలుగుదేశమే

గుర్తుపెట్టుకో జగన్….. గెలిచేది తెలుగుదేశమే

 

హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

 

నందికొట్కూరు, ఏప్రిల్ 15, (సీమకిరణం న్యూస్):

 

గుర్తుపెట్టుకో జగన్ రాష్ట్రంలో గెలిచేది తెలుగుదేశం ప్రభుత్వమే అని టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం నందికొట్కూరు పట్టణంలో స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రను బాలయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో బాలకృష్ణ కొత్త బస్టాండ్డ నుండి పటేల్ సెంటర్ వరకు వరకు రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లక్ష్మీనరసింహస్వామి తన ఇష్టదైవమని, దుష్ట శిక్షణకు వెలసిన స్వామి దర్శనంతో వైఎస్సార్సీపీ పాలన అంతానికి సైకిల్‌ రావాలని స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి టీడీపీ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వం మారితే ముస్లింలకు ఉన్న బీసీ-ఇ రిజర్వేషన్‌ రద్దు చేస్తారంటూ అధి కార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీతోనే ముస్లింలకు ఎంతో మంచి జరిగిందన్నారు.

ప్రస్తుతం జరిగే ఎన్నికలు మన రాష్ట్రానికి భవితకు ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు ముందు రైతు కార్పొరేషన్ అమలు చేస్తామని చెప్పి విస్మ రించడంతో రైతు ఆత్మహత్యలకు కారణమైనా రన్నారు. విద్యుత్ ధరలు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి ప్రజలను నట్టేట ముంచిందన్నారు. పసుపు జెండాను ఆంధ్ర రాష్ట్రంలో ఎగరవేయ వలసిన బాధ్యత మీ వంతుగా నందికొట్కూరు నియో జకవర్గం ప్రజలకు ఉందన్నారు. పసుపు దండు కదులుతుంటే తాడేపల్లిలో జగన్ గుండె దడ దడ కొట్టుకుంటుందని నందికొట్కూరు పట్టణ ప్రజలకు అరాచకం కావాలా సంక్షేమ పాలమ అభివృద్ధి కావాలా మీరే తెలుసుకోండి అని అన్నారు. వైసిపి ప్రభుత్వం రూ 1600 కోట్ల ప్రభుత్వ ధనంతో రాష్ట్రంలో ఓట్ల కోసం సిద్ధం సిద్ధమని ప్రజాధనం వృధా చేస్తున్నారనీ, వైయస్ జగన్ అమ్మను చెల్లిని తరిమి రౌడీలకు రక్షణ కల్పిస్తున్నారనీ. యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మపలికి నేడు మోసం చేయడం జరిగింద న్నారు. అధికారం చేపట్టిన వారానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తానని నమ్మబలికి నిండా మోసం చేశారన్నారు. నా ఎస్సీలు నా మైనార్టీలు, నా బీసీలు అని అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసిన ఘనత జగన్ దేని అన్నారు. ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఉండే ఆదరణ అలాగే నందమూరి తారక రామారావు కి మైనార్టీలు అంటే ఎంతో ఎనలేని ప్రేమ మైనార్టీలకు దేశంలోనే మొట్ట మొదటిసారిగా సంక్షేమ కార్పొరేషన్లో ప్రారంభించి ఆదుకున్న ఘనత ఎన్టీఆర్ దే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన పథకాలు కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని గట్టిగా హామీ ఇచ్చారు. రాయలసీమకు ప్రతి ఎకరాకు నీరందుతుందంటే నందికొట్కూరు నుంచి అందుతుందని చేతులు జోడించి దండం పెట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో రోడ్లు కాలువలు మహిళలకు ఇంకెన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించడం జరిగిందనీ కాబట్టి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం కూటమిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసు కోవాలని నందమూరి బాలకృష్ణ నందికొట్కూరు నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం నంద్యాల అసెంబ్లీ ఇన్చార్జి మాండ్ శివానందరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజల సమీకరణతో ముగిసింది.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జయ సూర్య నందికొట్కూరు పట్టణ ముఖ్య నాయ కులు, నియోజకవర్గ టిడిపి నాయకులు కార్య కర్తలు టిడిపి కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఘన విజయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నందికొట్కూరు రూలర్ అర్బన్ సిఐ, ఎస్ఐలు బందోబస్తుతో నిర్వహించారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!