ANDHRABREAKING NEWSPOLITICS
శ్రీరంగాపురం గ్రామంలో వైసీపీకి షాక్…
కేఈ శ్యామ్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం
కేఈ శ్యామ్ బాబు గెలుపే లక్ష్యంగా పని చేస్తాం
శ్రీరంగాపురం మాజీ ఎంపీటీసీ మొప్పె హనుమంతు , రంగస్వామి
శ్రీరంగాపురం గ్రామంలో వైసీపీకి షాక్…
వైసీపీని వీడి టిడిపిలోకి 40 కుటుంబాలు చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేఈ శ్యామ్ బాబు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 17, (సీమకిరణం న్యూస్) :
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యామ్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మొప్పె హనుమంతు పేర్కొన్నారు. బుధవారం వెల్దుర్తి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు సమక్షంలో వైసీపీకి చెందిన శ్రీరంగాపురం మాజీ ఎంపీటీసీ మొప్పె హనుమంతు మరియు రంగస్వామి అనుచరులు 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కేఈ శ్యామ్ బాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి శూన్యమని పార్టీలోని విధివిధానాలను నచ్చక వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే అవుతుందని వారు తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి సైనికుల్లా పని చేసి కేఈ శ్యామ్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, వెల్దుర్తి టీడీపీ మండల అధ్యక్షుడు బలరాం గౌడ్, వెల్దుర్తి మండల టిడిపి సీనియర్ నాయకులు సుబ్బరాయుడు, సూదేపల్లె జయ రాముడు, వెల్దుర్తి టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.