
టీడీపీలో చేరిన ఉలిందకొండ వాసులు
-: పార్టీలోకి ఆహ్వానించిన గౌరు చరిత
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 18, (సీమకిరణం న్యూస్):
కల్లూరు మండలం ఉలింద కొండ గ్రామానికి చెందిన తెలుగు రమేష్, గౌండ బోయ కృష్ణ, గొల్ల ఏళ్ళప్ప, కృష్ణ రెడ్డి,తెలుగు వెంకటేష్, డాక్టర్ భగవాన్,హరి తో పాటు పలు కుటుంబాలు వైసిపి నీ వీడి గౌరు చరిత సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
వీరిని గౌరు చరిత పసుపు కండువాలు కప్పి, పార్టీ లోకి ఆహ్వానించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఇవి రమణ, రంగస్వామి రెడ్డి, వెంకటేశ్వర్లు, సుబ్బ రాయుడు, ఇద్ధం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.