అట్టహాసంగా నామినేషన్ వేసిన బుట్టా రేణుక
అట్టహాసంగా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక
ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన బుట్టా రేణుక
ఎమ్మిగనూరు ప్రతినిధి, ఏప్రిల్ 18, (సీమకిరణం న్యూస్) :
ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి బుట్టా రేణుకతో పాటు పార్టీ శ్రేణులు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ నీరాజనం ఫలికారు. వైఎస్సార్ కూడలి మీదుగా వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఎర్రకోట చెన్నకేశవరెడ్డి,వీరశైవ లింగాయత్ అధ్యక్షులు రుద్రగౌడ్ తో పాటు ఇతర సీనియర్ నాయకులు,కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం ఎమ్మిగనూరు నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుకా ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అనంతరం కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినైట్లెతే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు.