కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 18, (సీమకిరణం న్యూస్) :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి సి.హెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు న్యాయ సేవలు అభినందనీయమని పారా లీగల్ వాలంటీర్లు పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న సంద ర్భంగా పారా లీగల్ వాలంటీర్లు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, బాలాజీ రెడ్డి, శ్రావణ్ కుమార్, హరితేశ్వర మునిరాజు, హేమంత్ కుమార్, వినోద్ కుమార్, హరిత రెడ్డి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాది శివ సుదర్శన్ తదితరులు పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.