ANDHRABREAKING NEWSSTATEWORLD
వాగులో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

వాగులో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, మార్చి13, (సీమ కిరణం న్యూస్) :
ఏఎస్ పేట మండలం పందిపాడు గ్రామ సమీపంలోని పందిపాడు వాగు ఆలుగు వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి పడి మృతి చెందాడు వివరాల్లోకి వెళితే మండల కేంద్రమైన ఏఎస్ పేట లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాకు మానసిక శారీరక మతిస్థిమితం లేని రోగులు వస్తూ ఉంటారు వారిలో మతిస్థిమితం లేని వారిని వారి కుటుంబ సభ్యులు ఇక్కడ వారి బాగోగులు చూసుకునే సంరక్షకుల వద్ద వదిలి వెళ్తూ ఉంటారు అదే కోణంలో కర్నూలుకు చెందిన షేక్.షేక్షావలి తండ్రి అబూబకర్ 22 అనే మతిస్థిమితం లేని వ్యక్తిని 14 నెలల క్రితం ఓ సంరక్షకుని వద్ద వదిలి వెళ్లగా గత మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన షేక్షావలి శనివారం పందిపాడు అలుగు వాగులో శవమై తేలాడు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు కేసు నమోదు చేసుకున్న ఏఎస్ పేట ఎస్ఐ షేక్.సుభాని వివరాలు సేకరిస్తున్నారు.
“సంరక్షకుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు” సంరక్షకుల వద్ద వదిలి వెళ్ళిన మతిస్థిమితం లేని వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనే వాటిపై సంరక్షకులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి అయితే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పై బాధితుల బంధువులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడ వలసిన అవసరం ఎంతైనా ఉందని దర్గా భక్తులు కోరుతున్నారు.