ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం

సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం
టిడిపి నేతలు జ్ఞానేశ్వర్ గౌడ్, బలరాం గౌడ్, సుబ్బరాయుడు
సూపర్ సిక్స్ పథకాలపై కలిసికట్టుగా విస్తృత ప్రచారం నిర్వహించిన వెల్దుర్తి టిడిపి నాయకులు
టిడిపి ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు మరియు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబును అఖండ మెజార్టీతో గెలిపించండి
కర్నూలు ప్రతినిధి / వెల్దుర్తి, ఏప్రిల్ 18, (సీమకిరణం న్యూస్) :






సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని వెల్దుర్తి టీడీపీ నేతలు మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, వెల్దుర్తి టిడిపి మండల అధ్యక్షుడు బలరాం గౌడ్, వెల్దుర్తి మండల టిడిపి సీనియర్ నాయకులు సుబ్బరాయుడు అన్నారు. గురువారం వెల్దుర్తి మండలంలోని కృష్ణాపురం, కలుగోట్ల గ్రామాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ప్రతి కుటుంబానికి వరమన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికి తెలియపరచడమే ముందున్న ప్రధాన అంశంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలను సూచించారు. రాష్ట్రం బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వెయ్యాలన్నారు. కర్నూలు పార్లమెంటు టిడిపి అభ్యర్థి బస్తిపాడు నాగరాజు మరియు పత్తికొండ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబును
అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల తెదేపా నాయకులు, కృష్ణాపురం, కలుగోట్ల గ్రామ టిడిపి నాయకులు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.