మళ్లీ గెలుపు నాదే : ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
భారీ జన సమూహం మధ్యన కంగాటి శ్రీదేవమ్మ నామినేషన్
వివిధ మండలాల నుండి వేలాది మంది తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు
గెలుపు తథ్యం అంటున్న ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
కర్నూలు ప్రతినిధి / పత్తికొండ /వెల్దుర్తి, ఏప్రిల్ 19, (సీమకిరణం న్యూస్) :
ఎన్నికల్లో మళ్లీ గెలుపు నాదేనని ప్రజల ఆశీస్సులతో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అన్నారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ నామినేషన్ సందర్భంగా శుక్రవారం పట్టణంలో వున్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గరకు పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ నుండి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ జన సమూహ మధ్యన భారీ ఎత్తున కేరళ వాయిద్యం, లంబాడీల నృత్యాలు, బీరప్పడోలు, తప్పెట్లు,డ్రమ్స్ లతో నృత్యాలు చేస్తూ పుర వీధుల్ల గుండా బయలుదేరి స్థానిక ఆర్డిఓ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు అభ్యర్థి బి.వై.రామయ్య, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ, పత్తికొండ నియోజకవర్గం పరిశీలకులు వెన్నుపూస రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నాగరతమ్మ, కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి, వెల్దుర్తి మండల కన్వీనర్ బొమ్మన రవి రెడ్డి, అటెకెల గుండు బాబు రెడ్డి, శ్రీరంగడు, లలిత హోటల్ రామచంద్ర, మండల ఎంపీపీ ఎం.నారాయణదాసు ,మండల కన్వీనర్ కారం నాగరాజు, హరీష్ రెడ్డి, మల్లికార్జున్రెడ్డి, అమర్నాథ్ రెడ్డి వివిధ మండలాల గ్రామ సర్పంచులు, చక్రాల శ్రీరాములు, తిప్పన్న, ప్రభాకర్ రెడ్డి, మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.