
కేఈ శ్యామ్ బాబు గెలుపే లక్ష్యం
రైతు సంఘం అధ్యక్షుడు ఈదుల వెంకట రాముడు
గుంటుపల్లె గ్రామంలో సూపర్ సిక్స్ పథకాలపై విస్తృత ప్రచారం
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 20, (సీమకిరణం న్యూస్) :
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు గెలుపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని రైతు సంఘం అధ్యక్షుడు ఈదుల వెంకట రాముడు పేర్కొన్నారు. శుక్రవారం వెల్దుర్తి మండలంలోని గుంటుపల్లె గ్రామంలో ” బాబు ష్యూరీటి- భవిష్యత్ గ్యారెంటీ ( సూపర్ 6)” కార్యక్రమం నిర్వహించారు. గుంటుపల్లె గ్రామంలో ఇంటింటికి తిరిగి ” బాబు సూపర్ 6″ మ్యానిఫెస్టో ప్రతి ఒక్కరికి వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలన్నారు. కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తి పాడు నాగరాజు మరియు పత్తికొండ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబును అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూలింటి శేషన్న , బళ్లారి రాముడు ,దామ నారాయణ , జెరిపిటి రాజ శేఖర్ , గొల్ల సలీంద్ర శేఖర్ ,గిత్త మురళి , జెరిపిటి రమేష్ , తదితరులు పాల్గొన్నారు.