ANDHRABREAKING NEWSSTATEWORLD
ఘనంగా 86వ శివ జయంతి ఉత్సవాలు
ఘనంగా 86వ శివ జయంతి ఉత్సవాలు
నెల్లూరు, మైపాడు, మార్చి13, (సీమకిరణం న్యూస్) :
రైతులే దేశానికి వెన్నుముక అని రైతులు లేకుంటే మానవ జాతి మనుగడ కష్టమని రైతు కుటుంబీకులు మైపాడు యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని మైపాడు గ్రామంలో శ్రీ ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 86వ శివ జయంతి ఉత్సవాలలో పాల్గొనీ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శివలింగానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టూ పక్కల గ్రామాలలో ఉన్న 20 మంది రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నుముక అని రైతులు లేకుంటే మానవ మనుగడ కష్టమని అన్నారు. బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం సేవలను కొనియాడారు. మానసిక ప్రశాంతతకు ధ్యానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనంతరం నృత్యాలు చేసిన చిన్నారులకు మొమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం సభ్యులు వెంకటేశ్వర్లు, ప్రసన్న, రాధిక, అనిల్,మాధవ్,మైపాడు సర్పంచ్ సంఘం వెంకయ్య, మాజీ ఎంపిటిసి శ్రీహరికోట ప్రసాద్, పామంజి నరసింహ, శివాలయం చైర్మన్ కనుపూరు సురేంద్ర, ఎంపీటీసీలు సుబ్రహ్మణ్యం, రమణయ్య, నరసాపురం సర్పంచ్ సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.