కర్నూలు ప్రగతి-నవ శకానికి నాంది
-: కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఎం. శ్రీ హర్ష
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 19, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు ప్రగతి-నవ శకానికి నాంది అని ఆ పార్టీ
కర్నూలు అసెంబ్లీ స్వాతంత్ర అభ్యర్ధి ఎం. శ్రీ హర్ష
పేర్కొన్నారు. శుక్రవారం తన అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కర్నూలు నగరంలోని మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ రీజియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటాను రాబట్టేందుకు పోరాటం చేస్తామన్నారు. ఆ నిధుల నుండి 40 శాతం వాటాను రాయలసీమ రీజియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఖర్చు చేస్తామని అన్నారు. రాజధాని త్యాగం కింద కర్నూలు అభివృద్ధికి జనాభా ప్రాతిపదికన ప్రత్యేక ప్యాకేజీ చర్యలు చేపడతామన్నారు. నీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. వేదవతి – గుండ్రేవుల నిర్మాణాలు, గుండ్రేవుల ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నిర్మాణానికి సైతం కేంద్ర నిధులు రాబట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో కర్నూలు నగరాన్ని పట్టిపీడిస్తున్న నీటి సమస్యకు శాశ్విత పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి చేస్తామని శ్రీ హర్ష పేర్కొన్నారు.