ఎన్నికలకు… సై అంటూ కర్నూలు జిల్లా కాలుదువ్వుతోంది…
ఆలూరు నుండి పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా పనిచేసిన వీరశైవ కులాన్ని గుర్తించి ఆలూరు
ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ గుర్తించిన ఘనత తెలుగుదేశం పార్టీది….
-: జిల్లాలోనే కురుబ కులాన్ని గుర్తించి ఎంపీటీసీ నుండి ఎంపీగా నాగరాజును జిల్లా నుండి ఢిల్లీకి పంపిస్తున్న ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే…
-: ఈ ఎన్నికలు ఎంతో కీలకం… భవిష్యత్తును మార్చే ఎన్నికలుగా ప్రజా గౌరవంగా జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీని అందివ్వాలని ప్రజలకు పిలుపు…
-: జగన్ ముద్దులకు… మురిసిపోయి గతంలో అధికారమిస్తే ప్రజలకు పిడిగుద్దులు, బాదుడులను ఇస్తున్న జగన్…
-: ప్రజాగళంలో వైకుంఠం శ్రీరాములును, కపట్రాళ్ల వెంకటప్ప నాయుడు తెదేపాకు చేసిన సేవను నెమరు వేసుకున్న చంద్రబాబు…
-: ముస్లిం మైనారిటీలకు న్యాయం చేసే పార్టీ, తెలుగుదేశం పార్టీయే…
-: టిడిపి తోనే రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి సాధ్యమని ఆలూరు ప్రజాగళంలో చెప్పిన తెదేపా
-: జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు….
కర్నూలు బ్యూరో ఏప్రిల్ 19 (సీమకిరణం న్యూస్): :
ఎన్నికలకు సై అంటూ కర్నూలు జిల్లా కాలుదువ్వుతోంది. ఆలూరులో పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేసిన వీరశైవ కులాన్ని గుర్తించి ఆలూరు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ ను అలాగే కురుబ సామాజిక వర్గాన్ని ఇంతవరకు ఏ ఒక్కరు కూడా గుర్తించలేదని అలాంటి సామాజిక వర్గం నుండి ఎంపీటీసీ గా ఉన్న వ్యక్తిని ఏంపి స్తాయిని కల్పిస్తూ జిల్లా నుండి ఢిల్లీకి పంపిస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీదేనని శుక్రవారం ఆలూరులో ప్రజాగళం సభకు ముఖ్య అతిథిగా వచ్చిన తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్కు ఒక్క అవకాశం అంటూ ఆయన పెట్టిన ముద్దులకు ఉప్పొంగిపోయి ప్రజలంతా ఆయనకు అధికారాన్ని కట్టబెడితే ఆయన మాత్రం ప్రజలకు చేసిందేమీ లేదని అధికార మదంతో గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మారుస్తూ 13న్నర లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసి రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ కాకుండా అప్పు ఆంధ్ర ప్రదేశ్ అంటూ ఇతర దేశాల వారు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే భయపడేలా తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఎంత సిగ్గుచేటో ప్రజలే తెలుసుకోవాలని సూచించారు. అలాగే సభలో వైకుంఠం శ్రీరాములను కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడును నెమరువేస్తూ వారు పార్టీకి చేసిన సేవలను కొనియాడుతో ప్రస్తుతం వారి వంశాన్ని పార్టీలో ముందుకు తీసుకో పోతున్న వైకుంఠం శివప్రసాద్ జ్యోతి దంపతులను, మరియు కప్పట్రాళ్ల బుజ్జమ్మ దంపతులను సైతం కొనియాడుతూ, కోట్ల సుజాతమ్మ వర్గీయులు కూడా పార్టీకి ఎనలేని సేవ చేశారని అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల వారికి టిక్కెట్ను కేటాయించలేకపోయామని భవిష్యత్తులో వారికి పార్టీ న్యాయం చేస్తుందని కోట్ల సుజాతమ్మ అభిమానులకు సూచించారు. జగన్మోహన్ రెడ్డి కేవలం రాష్ట్రంలోనే పులి అని ఢిల్లీలో మాత్రం పిల్లి అని మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రజాయాత్ర లో తెలిపారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని ఆయన ఆరోపిస్తూ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేసింది ఏమీ లేదని, ప్రతిపక్ష నేతల పైన సామాన్య ప్రజల పైన అక్రమ కేసులు పెట్టడమే తప్ప అభివృద్ధిని మరిచారని విమర్శించారు తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వద్ద ఫిల్లిలా వ్యవహరిస్తూ కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి కే దక్కుతోందని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి మరిచిపోయి, ప్రజలను అధిక ధరలతో నడ్డి విరుస్తున్నారని అన్నారు. ఒక అవకాశం అంటూ సీఎం కుర్చీలో ఉండే ప్రజాసంక్షేమాన్ని మరచి కాలయాపన చేశారని ఆరోపించారు.
నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఏది…
గడిచిన ఐదు సంవత్సరాలలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఏది అని, డీఎస్సీ ఏమైందని, పాఠశాలల రూపురేఖలు మారుస్తానని చెప్పి ఉపాధ్యాయుల కొరత సృష్టించడమే కాకుండా ఉన్న పాఠశాలలను సైతం మూసివేసిన చరిత్ర జగన్ది కాదా అనే నిరుద్యోగులను అడిగారు. అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని, దుర్మార్గ పాలనకు చరమగీతం పాడెందుకోసమే తమ లక్ష్యంగా భావిస్తూ జనసేన బిజెపి లతో పొత్తును ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రజలు టిడిపికి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ పోటీ చేస్తున్నారని కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు పోటీ చేస్తున్నారని, వారి గెలుపుకు ప్రజలు సైకిల్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఆలూరు నియోజకవర్గం అంటేనే గతంలో తెలుగుదేశానికి కంచుకోటగా ఉండేదని అలాంటి కంచుకోటకు కొంతమంది చీడ పురుగులు తోడవడం వల్ల కంచుకోట బీటలు వారిందని ప్రస్తుతం తిరిగి పాతికేళ్ల చరిత్రను తిరగరాయా లంటే ఆలూరు నియోజకవర్గం నుండి వీరభద్ర గౌడ్ ను అఖండ మెజారిటీతోనో, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజును అఖండ మెజారిటీతో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిదని ప్రజలకు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి తిక్కరెడ్డి, తెదేపా సీనియర్ నాయకులు వైకుంఠం శివప్రసాద్ జ్యోతి దంపతులు కప్పట్రాళ్ల బుజ్జమ్మ దంపతులు, బీటీ నాయుడు, ఇతర నియోజకవర్గాల సీనియర్ నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.