టీడీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
టిడిపి కార్యకర్తలకు అండగా ఉంటా…
పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు
శ్రీరంగాపురం గ్రామంలో వైసీపీకి మరో షాక్…
వైసీపీని వీడి టిడిపిలోకి 200 కుటుంబాలు చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేఈ శ్యామ్ బాబు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 17, (సీమకిరణం న్యూస్) :
తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేద్దామని పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు కోరారు. శనివారం వెల్దుర్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెల్దుర్తి పట్టణం మరియు శ్రీరంగాపురం గ్రామ పంచాయతీకి చెందిన లక్ష్మీ పల్లె, చిన్న కోనపల్లె, సచివాలయం కన్వినర్ మధు, వెల్దుర్తి పట్టణ వైసీపీ 12 వ వార్డు మెంబర్ మెకానిక్ శంకర్, గంగ పుత్ర సంఘం మాజీ అధ్యక్షుడు డోన్ శేఖర్, వివిధ గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు 200 కుటుంబాలకు పైగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కేఈ శ్యామ్ బాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైసిపి పాలనలో అరాచకాలు ,దోపిడిలు, భూకబ్జాలు అవినీతిలో కూరుకు పోయిందన్నారు. అభివృద్ధి మరిచి కేవలం ఎమ్మెల్యే తన సొంత ప్రయోజనాల కోసం తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారని సామాన్య ప్రజలను ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎమ్మెల్యే వల్ల నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధి కాలేదని మా గ్రాములు అభివృద్ధికి దూరమయ్యాయని వారు ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని నియోజకవర్గ అభివృద్ధి బాటలో నడవాలంటే పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు వల్లే సాధ్యమన్నారు. అందుకే ఆయన సమక్షంలో టీడీపీ పార్టీలో చేరామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కేఈ శ్యామ్ బాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వారి అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, వెల్దుర్తి టీడీపీ మండల అధ్యక్షుడు బలరాం గౌడ్, వెల్దుర్తి మండల టిడిపి సీనియర్ నాయకులు సుబ్బరాయుడు, సూదేపల్లె జయ రాముడు, వెల్దుర్తి టిడిపి నాయకులు, మండల నాయకులు, గ్రామ స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.