CRIME
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే పోలీసుల కవాతు
వెల్దుర్తి సర్కిల్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి, యస్ ఐ చంద్ర శేఖర్ రెడ్డి
గోవర్ధనగిరి, బోగోలు, ఎల్ బండ, రత్నపల్లి గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు
కర్నూలు క్రైమ్ బ్యూరో / వెల్దుర్తి, ఏప్రిల్ 20, (సీమకిరణం న్యూస్) :
ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని వెల్దుర్తి సర్కిల్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి, యస్ ఐ చంద్ర శేఖర్ రెడ్డి లు తెలిపారు. శనివారం సిఐ సురేష్ కుమార్ రెడ్డి, యస్ ఐ చంద్ర శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వెల్తుర్థి పోలీసుస్టేషన్ పరిదిలోని గోవర్ధనగిరి, బోగోలు, ఎల్ బండ, రత్నపల్లి గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికలలో ప్రజలందరూ నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు.