BREAKING NEWSCRIMESTATEWORLD
కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలి : ఏపీడబ్ల్యూజేఎఫ్
కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలి
ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో డిఎస్పీ కి వినతి
కర్నూలు టౌన్, మార్చి 14, (సీమకిరణం న్యూస్) :
ఈ నెల 12 న అఖండ విజయోత్సవ సభ లో ప్రజాశక్తి కర్నూలు స్టాఫ్ రిపోర్టర్ పై ఒక కానిస్టేబుల్ దాడి చేయడం, దుర్భాశలాడుతూ మాట్లాడని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఖండించింది. డిఎస్పీ కె.వి.మహేష్ కు వినతిని అందించారు. డీఎస్పీ స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని, క్షమాపణ చెప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మద్దిలేటి, మౌలాలి, చిన్న రామాంజనేయులు నాగేంద్ర లు మాట్లాడుతూ భవిష్యత్ లో కూడా ఇలాంటి అఘాయిత్యాలు పునరావృతం కాకుండా చూడాలని ఆ విదంగా కింది స్థాయికి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు డిఎస్పీ తక్షణమే చర్యలు తీసుకుని అదేశిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి మేనేజర్ నరసింహ, చంద్రయ్య, ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు,జర్నలిస్ట్ లు,ప్రజాశక్తి సిబ్బంది పాల్గొన్నారు.