ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
బి ఫారం అందుకున్న కేఈ శ్యామ్ బాబు
కర్నూలు ప్రతినిధి/పత్తికొండ/ వెల్దుర్తి , ఏప్రిల్ 21, (సీమకిరణం న్యూస్) :
పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఈ శ్యామ్ బాబు ఆదివారం బి ఫారం అందుకున్నారు. రాజధాని అమరావతిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశంలో ఎన్నికల్లో విజయం కోసం దిశా నిర్దేశం చేశారు. అభ్యర్థులు విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ప్రతి గ్రామాన్ని అభ్యర్థి స్వయంగా పర్యటించాలని చంద్రబాబు తెలిపారు. తాను, లోకేష్, పవన్ కళ్యాణ్ సైతం ప్రచారానికి వస్తామని పేర్కొన్నారు.