
నా లక్ష్యం.. సాఫ్ట్ వేర్ గా రాణిస్తా
-: షేక్ నయీమ్ ముస్తాక్
కర్నూలు విద్య, ఏప్రిల్ 22, (సీమకిరణం న్యూస్) :
నా లక్ష్యం.. భవిష్యత్తులో సాఫ్ట్ వేర్ గా రాణిస్తానని అందుకు అనుగుణంగా ఇప్పటి నుండే ప్రణాళికలు రచించుకొని ముందుకు సాగుతానని షేక్ నయీమ్ ముస్తాక్ పేర్కొన్నారు. తాను కృష్ణానగర్ లోని న్యూ కేశవరెడ్డి స్కూల్లో 10 వరకు అభ్యసించానని తెలిపారు. సోమవారం విడుదల చేసిన పది ఫలితాల్లో 471 మార్కులు సాధించడం జరిగింది. తాను సాధించిన ఫలితాలను తమ తల్లిదండ్రులు నజీర్ అహ్మద్ బాష దంపతులు ప్రత్యేకంగా అభినందించడం జరిగిందన్నారు. తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన విద్యలో మరింతగా రాణించడానికి కృషి చేస్తానని నయీమ్ ముస్తాక్ వివరించారు.