ANDHRABREAKING NEWSPOLITICSSTATE
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నౌషద్ భాష
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నౌషద్ భాష
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 22, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నౌషద్ భాష సోమవారం ఎన్నికల అధికారి భార్గవ్ తేజకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే జీరో బడ్జెట్ రాజకీయాలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. సామాన్యుడు సైతం చట్టసభలకు వెళ్లేందుకు జీరో బడ్జెట్ రాజకీయాలు ఎంతగానో ఉపకరిస్తాయని నౌషద్ భాష పేర్కొన్నారు.