మరోసారి అమ్మను ఆశీర్వదించండి
మళ్లీ మన ప్రజా ప్రభుత్వమే వస్తుంది..
మీ ఇంటికే మీ పింఛన్‌ను తీసుకొస్తుంది
కంగాటి రామ్మోహన్ రెడ్డి
కర్నూలు ప్రతినిధి / వెల్దుర్తి, ఏప్రిల్ 22, (సీమకిరణం న్యూస్) :
మళ్లీ మన ప్రజా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మీ ఇంటికి మీ పింఛన్లు వస్తాయని మరోసారి అమ్మను ఆశీర్వదించాలని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తనయుడు కంగాటి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం వెల్దుర్తి మండల పరిధిలోని మంగంపల్లి, బింగి దొడ్డి, కాసాపురం గ్రామాలలో వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తనయుడు కంగాటి రామ్మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి మాజీ జెడ్పిటిసి సచివాలయాల గృహసారధుల కన్వీనర్ దేశాయ్ షమీర్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి సుంకన్నలతో కలసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాసులు, రాజు, వెంకట్ రాముడు, చంద్ర, కృష్ణుడు, దస్తగిరి, మండల వైసీపీ నాయకులు శ్రీరామ్ రెడ్డి, కొత్తూరు వెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట్ నాయుడు, నరసాపురం కృష్ణారెడ్డి, వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.