వైసీపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి
- వైసీపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి
- జగన్ ని ఇంటికి పంపేందుకు ప్రజలందరూ సిద్ధం
- టిడిపి నాయకులు, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్
- సూపర్ సిక్స్ పథకాలపై విస్తృత ప్రచారం
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 22, (సీమకిరణం న్యూస్):
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని జగన్ ఇంటికి పంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నట్లు టిడిపి నాయకులు, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ అన్నారు. సోమవారం పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు ఆదేశాల మేరకు వెల్దుర్తి మండలం లక్ష్మీనగరం, దాసర దొడ్డి, తాండా, గోవర్ధనగిరి, యస్. పేరముల గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుపై ఓటు వేయమని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పథకాల పేరిట ప్రజలను మోసగిస్తుందని, ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపుతుందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమానికి వెల్దుర్తి మండల నాయకులు మాజీ ఎంపీపీ సుబ్బరాయుడు, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, మాజీ పార్టీ అధ్యక్షులు జయరాముడు, వెల్దుర్తి మండల తెలుగు యువత అధ్యక్షులు సుధాకర్ గౌడ్, హరికృష్ణ,అంచే రామకృష్ణ, వాచీల మల్లి, గోవర్ధనగిరి శ్రీనివాసులు, మద్దిలేటి, రంగడు,చిన్న హరి, ఎమ్మార్పీఎస్ గిడ్డయ్య, పెద్ద హరి, కే.అబ్దుల్లా,రాజేష్, సూరి, పెద్దయ్య స్వామి, బజార్, ఎల్ల స్వామి, సౌలు రాజ్, శ్రీరాములు, ఇమామ్, కాసిం, పరశురాముడు, బాబి పరమేష్ రాము,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.