ANDHRABREAKING NEWSCRIMEMOVIESPOLITICSSPORTSSTATE

మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించండి

మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించండి

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

పత్తికొండ ప్రతినిధి/ వెల్దుర్తి/ క్రిష్ణగిరి, ఏప్రిల్ 22, (సీమకిరణం న్యూస్)

టిడిపి నాయకులు మాయమాటలు నమ్మి మోసపోకూడదని, మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించాలని మీ ఇంటి ఆడ బిడ్డగా తోడుగా ఉంటానని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. సోమవారం క్రిష్ణగిరి మండలంలోని సిహెచ్. ఎర్రగుడి గ్రామంలో జడ్పిటిసి సభ్యులు కేఈ సుభాషిని, ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి, మండల కన్వీనర్ ఆర్ బి వెంకటరాముడు,గ్రామ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ముందుగా చుంచు ఎర్రగుడి గ్రామంలో ముందుగా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామ నాయకులు భీమి రెడ్డి,లక్ష్మీకాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. యూత్ కన్వీనర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారి పట్ల తన ఆప్యాయతను చాటుకుంటూ క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేసి ఎమ్మెల్యే కి వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పారిపాలన సాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ కార్య్రమంలో క్రిష్ణగిరి మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరియు చుంచు ఎర్రగుడి గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!