ఓటు విలువ తెలియజెప్పండి.. ప్రైజ్ గెలుచుకోండి
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 28, (సీమకిరణం న్యూస్)
కర్నూలు జిల్లా ఓటరు మహాశయులకు నమస్కారం. మీరు మొదటిసారి ఓటు హక్కును వినియోగిస్తున్నారా.. అయితే, ఈ అవకాశం మీకోసమే. మన భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ముప్పై సెకండ్ల వీడియో చేయండి. ఆ వీడియోలో ఓటు యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యాన్ని వివరించి జిల్లా స్వీప్ నోడల్ అధికారి గారి మెయిల్ ఐడికి పంపించండి. వాటిలో మూడు బెస్ట్ వీడియోలను సెలెక్ట్ చేసి ప్రైజ్ అందజేస్తాము. దీనితోపాటు జిల్లా కలెక్టరు గారి చేతుల మీదుగా ప్రశంసపత్రాన్ని అందజేస్తాం.
వీడియో పంపించవలిసిన ఆఖరి సమయం: మే 6వ తేదీ, సాయంత్రం 6 గంటల వరకు
వీడియో పంపించవలిసిన చిరునామా: kurnoolsveepnodalofficer@gmail.com
అర్హులు: కర్నూలు జిల్లాకు చెందిన మొదటిసారి ఓటు వేసే 18 ఏళ్ల నిండిన యువతీ యువకులందరూ అర్హులే
జారీ చేయువారు : కలెక్టరు & జిల్లా ఎన్నికల అధికారి, కర్నూలు జిల్లా