
హోలగుందలో వైసిపి నాయకుడు మాజీ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో భారీగా మైనారిటీల చేరిక
-: పార్టీలోకి ఆహ్వానించిన కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, ఆలూరు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి వీరభద్రగౌడ్
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 27, (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీకి షాక్ తగి లింది. హోలగుందలో వైసిపి నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ అబ్దుల్ సుబాన్ ఆధ్వర్యంలో ము స్లిం మైనారిటీలకు చెందిన వంద కుటుంబాలు శుక్రవారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి బస్తిపాటి నాగ రాజు, ఆలూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ లు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సంధర్బంగా ఎం.పి అభ్యర్థి నాగరాజు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు..టిడిపి హయాంలో ముస్లిం మైనార్టీ లకు రంజాన్ తోఫా, దుల్హన్ పథకం, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలతో పాటు అనేక పథకాలు తీసుకొచ్చి వారి సంక్షేమం కోసం పాటు పడితే .. ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రం వారి సంక్షేమాన్ని సంక్షోభంలో నెట్టిందని ఆరోపించారు. ఇక తాను సేవా మార్గాన్ని ఎంచుకునే రాజకీయా ల్లోకి వచ్చానని.. తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎం.పిగా గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎం.పిగా తనను, అసెంబ్లీ అభ్యర్ధి విరభద్రగౌడ్ ను గెలిపిస్తే ఆలూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని నాగరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలూరు బిజెపి, జనసేన ఇంచార్జి లు వెంకట రాముడు, వెంకప్పలతో పాటు హోలాగుంద మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.