వెబ్ సైట్ లో అభ్యర్థుల జాబితా..
వెబ్ సైట్ లో అభ్యర్థుల జాబితా..
అభ్యంతరాలు ఉన్నచో ఈ నెల 17 వ తేదీ సాయంత్రం 5గంటల లోపల తెలపండి..
వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పి. విజయ
కర్నూలు కలెక్టరేట్, మార్చి 14, (సీమకిరణం న్యూస్) :
అంధులు (వి హెచ్ ), బధిరులు (హెచ్ హెచ్) శారీరక విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగులు) (ఓహెచ్) బ్యాక్ లాగ్ నాన్-డి.యస్.సి.ఆఫీస్ సబార్డినేట్/అటెండర్ (వి హెచ్ జనరల్ ) & (ఓహెచ్ జనరల్ ) వాచ్ మెన్ కమ్ స్వీపర్ హెచ్ (హెచ్ జనరల్ ), పి.హెచ్.వర్కర్ (ఎం డి జనరల్)ఉద్యోగాలకు సంబంధించిన అర్హుల జాబితా ,తిరస్కరణ జాబితా వివరములను సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కర్నూలు వారి కార్యాలయంలోని నోటీసు బోర్డు నందు జిల్లా వెబ్సైట్ www.kurnool.ap.gov.in నందు ఉంచడమైనదని విభిన్న ప్రతిభవంతులు హిజ్రాల వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పి. విజయ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థులు నోటీసు బోర్డు వెబ్సైట్ నందు వుంచిన వివరాలలో ఏవేని అభ్యంతరాలు ఉన్నచో ఈ నెల 17 వ తేదీ సాయంత్రము 5గంటల లోపల సహాయ సంచాలకులకు లిఖిత పూర్వకంగా ఈ కార్యాలయవు మెయిల్ ఐడి: addwkni@gmail.com ద్వారా తగిన అధారములతో తెలియజేయవచ్చునన్నారు.లేదా పిర్యాదులను వినతి పత్రం రూపంలో నేరుగా గాని, (కోవిడ్-19 నిబంధనల మేరకు), పోస్టు ద్వారా గాని ఈ కార్యాలయపు పని వేళల యందు సమర్పించవచ్చునని తెలిపారు.గడువు మీరిన పిదప వచ్చు ఆక్షేపణలను పరిగణలోనికి తీసుకొనబడవని ఆమె ఆ ప్రకటనలో వెల్లడించారు.