
కేఈ శ్యామ్ బాబుకు భారీ మెజార్టీతో గెలిపిద్దాం : మిద్దె వెంకటేశ్వర్లు
బీసీవై పార్టీ నుండి టిడిపిలోకి చేరిన మిద్దె వెంకటేశ్వర్లు
పత్తికొండ ప్రతినిధి/వెల్దుర్తి, ఏప్రిల్ 29, (సీమకిరణం న్యూస్):
పత్తికొండ నియోజకవర్గానికి బీసీవై పార్టీ నుండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిద్దె వెంకటేశ్వర్లు టిడిపి నియోజకవర్గ అభ్యర్థి కె ఈ శ్యాంబాబు,టీడీపి రాష్ట్ర నాయకులు తుగ్గలి నాగేంద్ర ఆధ్వర్యంలో బీసీవై పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఆయన బీసీవై పార్టీ కార్యకర్తలు చేరారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి బీసీవై పార్టీ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని విత్ డ్రా చేసుకొని టిడిపిలోకి చేరానని అన్నారు. బిసివై పార్టీ పత్తికొండ అభ్యర్థి అయినటువంటి మిద్దె వెంకటేశ్వర్లకు టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మా సొంత గ్రామము జొన్నగిరి గ్రామాన్ని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి దత్తత తీసుకుందని. గత ఐదు సంవత్సరాల కాలంలో మా గ్రామంలో కనీసం తాగునీటి సమస్యను తీర్చలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రము ఐదు సంవత్సరములు వెనక్కి పోయిందని అన్నారు. ఈ వైసిపి పాలనలో గ్రామాలు ఏలాంటి అభివృద్ధి జరగలేదని మిద్దె వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులమై బీసీవై పార్టీ నుండి టిడిపిలోకి చేరామని అన్నారు. రేపు నెల 13వ తారీకు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో కెఈ శ్యాంబాబుకు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.