
వైఎస్ఆర్ అభిమానుల మద్దతు నాకే ఉంది
టిడిపి ,వైసిపి అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలను బానిసలుగా చూస్తారు
కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తా: అబ్దుల్ సత్తార్
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 30, (సీమకిరణం న్యూస్):
కర్నూలు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలో వైఎస్ఆర్ అభిమానుల మద్దతు తనకే ఉందని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ సత్తార్ చెప్పారు. వైఎస్ఆర్ అభిమానుల మద్దతుతో తాను కర్నూలు ఎంఎల్ఏ గా గెలిచి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజమైన వైయస్సార్ అభిమానులందరూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఈల (విజిల్) గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కర్నూలు, ఎంపీ ఎమ్మెల్యే గా తనను గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారిస్తానన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు తెప్పించి ఆదుకుంటామన్నారు. ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. పేదల పక్షాన నిలబడి అండగా ఉంటానని చెప్పారు.అణ్యాక్రాంతానికి గురైన వక్ఫ్, దేవాదాయ భూములను స్వాధీనం చేసుకొని పేద లందరికీ ఇళ్ళ స్తలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. బీజేపీ కి మద్దతు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న వైసిపి, టీడీపీ పార్టీలనుప్రజలు ఓడించాలని కోరారు. పార్లమెంటు లోబీజేపీ ప్రవేశ పెట్టిన ముస్లిం వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చి న వైసీపీ మళ్ళీ మాయమాటలు చెప్పి ముస్లింలనుమోసం చేస్తోందన్నారు. బీజేపీ తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తానన్నబీజేపీ అజెండా పై స్పష్ట మైన వివరణ ఇవ్వడం లేదని విమర్శించారు. ముస్లిం లకు మేలు చేకూర్చే రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి అమలు చేసేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా తాను కృషి చేస్తానని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తానని అన్నారు. కర్నూలు జిల్లాలోని ప్రజలందరూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులకు విజిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలపై పెత్తనం చెలాయిస్తూ అధికారం కోసం ఆరాటపడుతున్న పారిశ్రామికవేత్తలు, వైట్ కాలర్ ఉద్యోగులకు ఓటు వేస్తే ,గెలిచిన తర్వాత ప్రజలను బానిసలుగా చూస్తారని ఆయన ఎద్దేవా చేశారు. తనలాంటి సామాన్యుడు ,పేదల కష్టాలు తెలిసిన వ్యక్తులకు ఈ ఎన్నికల్లో ఒక అవకాశం కల్పించి గెలిపించాలని ఆయన ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.