గోనెగండ్ల గ్రామంలో నెలకొన్న త్రాగునీటి కష్టాలను తీర్చాలి :- జనసేన
పల్లె ప్రజల గొంతెండి పోతుంటే ఎవ్వరికీ పట్టదా :-
భగ భగ మండే ఎండల్లో తప్పని త్రాగు నీటి కష్టాలు :-
కర్నూలు ప్రతినిధి /ఎమ్మిగనూరు/ గోనెగండ్ల, ఏప్రిల్ 30,(సీమకిరణం న్యూస్) :
ప్రజలు వేసవిలో ఎదుర్కొనే త్రాగునీటి సమస్యను పరిష్కరించడంలో దశాబ్దాల కాలం నుంచి నాయకులు రాజకీయ అస్త్రంగా వాడుకుంటూ ప్రజలను విస్మరిస్తూ ధైర్యంగా ఓట్లు అడుగుతున్నారే తప్ప ప్రజలు ఎదుర్కుంటున్న త్రాగునీటి కష్టాలను మాత్రం తీర్చడం లేదని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇంఛార్జి గానిగ బాషా గోనెగండ్ల మండల నాయకులు మాలిక్ తెలిపారు, గోనెగండ్ల మండల పరిధిలోని కులుమాల గ్రామ ప్రజలు సోమవారం రోజు ఖాలిబిందెలతో ధర్నాలు చేశారని అలాంటి ధర్నాలు చేసే గ్రామాలు ఎన్నో ఉన్నాయని ముఖ్యంగా గోనెగండ్ల మెజర్ గ్రామ పంచాయితీలో ప్రజలు భగ భగ మండే ఎండలకు గొంతెండి పోతే కనీసం వారి ఇళ్లలో సమయానికి త్రాగునీరు లేక తీవ్ర కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, త్రాగునీటి కోసం పల్లె ప్రజలు పొలం బాట పడుతుంటే పట్టణ ప్రజలు నీటిని కొనుగోలు చేసి త్రాగుతున్నారని ఇదేమి దౌర్భాగ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు, ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి కష్టాలను పట్టించుకొనే నాథుడే కరువైపోయారని ఎన్నికల విధుల్లో వెళ్లిన అధికారులు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కనపడక ప్రజల కష్టాలను తీరుస్తారనీ నమ్మి ఎన్నుకున్న గ్రామస్థాయి నాయకులు కనపడక ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతే ప్రజల కష్టాలు తీర్చేది ఎవరని ప్రశ్నించారు, ఇప్పటికైనా గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయితీతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే త్రాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.