ANDHRABREAKING NEWSPOLITICSSTATE

గోవర్ధనగిరి గ్రామంలో వైసీపీకి మరో షాక్…

కేఈ శ్యామ్ బాబు గెలుపుకు కృషి చేస్తాం : సుబ్బయ్య , రాజు

గోవర్ధనగిరి గ్రామంలో వైసీపీకి మరో షాక్…

వైసీపీని వీడి టిడిపిలోకి 30 కుటుంబాలు చేరిక

కేఈ నిఖిలేష్ గౌడ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన 30 కుటుంబాలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేఈ నిఖిలేష్ గౌడ్

కర్నూలు నజీర్ ప్రతినిధి / వెల్దుర్తి, మే 03, (సీమకిరణం న్యూస్) :

పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు గెలుపుకు కృషి చేస్తామని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన సుబ్బయ్య , రాజు తెలిపారు. శుక్రవారం వెల్దుర్తి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో టిడిపి సీనియర్ నాయకులు బొమ్మరెడ్డి పల్లి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కేఈ నిఖిలేష్ గౌడ్ సమక్షంలో వెల్దుర్తి మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన సుబ్బయ్య , రాజు మరియు 30 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి కేఈ నిఖిలేష్ గౌడ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోవర్ధనగిరి నివాసులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి వైఎస్ఆర్సిపి పార్టీలోనే కొనసాగుతూ ఉండే వారిమని తెలిపారు. అయితే మా కుటుంబాలకు సంబంధించి దాదాపు 30 ఓటర్లము ఉన్నామని తెలిపారు. మా ఇంటికి ముందర సిసి రోడ్లు కానీ, సంక్షేమ పథకాలు గాని, ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఏ సంక్షేమ పథకం కూడా మాకు సక్రమంగా అందివ్వకుండా మాకంటూ గుర్తింపు లేకుండా చేస్తున్నారని తెలిపారు. కావున మాకు టిడిపి పార్టీ మీద నమ్మకంతో.. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలుసుకొని, నారా చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఎంతగానో నచ్చాయని తెలిపారు. అందుకు మా కుటుంబాలు అందరం టిడిపి పార్టీ సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేసి తీరుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవర్ధనగిరి రామచంద్రుడు, మదిలేటి, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!