అమ్మకు ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇవ్వండి
వైకాపా యువ నాయకులు కంగాటి రామ్మోహన్ రెడ్డి
వెల్దుర్తి పట్టణంలో వైకాపా నాయకుల విస్తృత ప్రచారం
ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరిన రామ్మోహన్ రెడ్డి
పత్తికొండ ప్రతినిధి వెల్దుర్తి మే 06, (సీమకిరణం న్యూస్) :
మీ ఓటు హక్కుతో మరోసారి అమ్మకు ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇవ్వాలని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తనయుడు వైకాపా యువ నాయకులు కంగాటి రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి పట్టణంలోని 1,2,3,4,12,13 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో కంగాటి రామ్మోహన్ రెడ్డి మండల వైకాపా కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి, బ్రహ్మగుండం ఛైర్మెన్ బోమ్మన పెద్దిరెడ్డి, జడ్పీటిసి దాదిపోగు సుంకన్న, సర్పంచ్ ముత్యాల శైలజ దేవరాజ్ తో కలిసి పలు వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వైకాపాకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు తెలపాలని ఓటర్లను కోరారు. అమ్మని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని ఒకటి శ్రీదేవమ్మకు, రెండవ ఓటు కర్నూలు ఎంపీ బి వై రామయ్యకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు రత్నాపల్లి, రమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటనాయుడు, అనిల్ రెడ్డి, జి. యస్. ఆరిఫ్, రాజు, దేవరాజ్, డేవిడ్, మల్లికార్జున, లింగమూర్తి, శ్రీనివాసులు, రవికుమాం, హఫీజ్, సరీద్, రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.