
జగనన్న వీరాభిమాని యల్లక్రిష్ణ మృతి
కుటుంబ సభ్యులను పరామర్శించిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
యల్లక్రిష్ణ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన ఎమ్మెల్యే శ్రీదేవి
తీవ్ర ఆవేదనకు గురైన బొమ్మన రవిరెడ్డి
పత్తికొండ ప్రతినిధి, వెల్దుర్తి, మే 07, (సీమకిరణం న్యూస్) :
వెల్దుర్తి పట్టణానికి చెందిన జగనన్న వీరాభిమాని, వైకాపా కార్యకర్త యల్లక్రిష్ణ మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ కోలుకోలేక మృతి చెందాడు. మండల వైకాపా కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి వద్ద యల్లక్రిష్ణ పని చేసేవాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడ జరిగిన అక్కడికి వెళ్లి వచ్చేవాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఎనలేని అభిమానం పెంచుకున్నాడు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురై కర్నూలు విశ్వభారతి వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బొమ్మన రవిరెడ్డి వెంటనే పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, వైకాపా యువ నాయకులు కంగాటి రాంమోహన్ రెడ్డిలకు సమాచారం అందించారు. వెల్దుర్తికి చేరుకున్న ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి యల్లక్రిష్ణ ఇంటికి వెళ్లి మృతదేహాంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీదేవి ఓదార్చారు. అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఇతనికి భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవిరెడ్డి వద్ద చాలాకాలంగా పనిచేస్తూ అందరితో మంచిగా మెలిగే వాడైన ఇతను అకాల మరణం
చెందడంతో రవిరెడ్డితో పాటు పలువురు వైకాపా నాయకులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పరామర్శించిన వారిలో జడ్పీటిసి సుంకన్న, సర్పంచ్ శైలజ, వెంకట నాయుడు, ఆరిఫ్, రాజు, దేవరాజు, డేవిడ్, రహమాన్ తదితరులు ఉన్నారు.