ఎంపీజే రాష్ట్ర ప్రధాన సహాయ కార్యదర్శి గా మొహమ్మద్ అహ్మద్ షా ఖాదర్
ఎంపీజే రాష్ట్ర ప్రధాన సహాయ కార్యదర్శి గా మొహమ్మద్ అహ్మద్ షా ఖాదర్
ఎమ్మిగనూరు , మార్చి 14 , ( సీమకిరణం న్యూస్ ) :
మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొదటి మహాసభ విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో కే ఎమ్ అబ్దుల్ సుభాన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా ఉత్తమ అవార్డు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన కర్నూలు జిల్లా ఎంపీజే అధ్యక్షుడు లాల్ కోట మొహమ్మద్ ఖధీర్భాషాకు పురస్కారంతో సన్మానించారు. మొహమ్మద్ అహమ్మద్ షా ఖాదర్ గారి జ్ఞాపకార్థం మెమొంటో తో సన్మానించడం జరిగింది . ఎం పీ జే లో 2019 ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడిగా, 2020 కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా 2022 లో నన్ను ఎం పీ జే రాష్ట్ర కార్యవర్గ సభ్యుల లో లాల్కోట మహమ్మద్ ఖదీర్ భాషను ఎం పీ జే రాష్ట్ర సహాయ కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నాకు వెన్నంటే ఉండి నన్ను ఎం పీ జే పరిచయం చేసి ఒక నాయకుడిగా తీర్చిదిద్దిన ఎం పీ జే మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్ల మొహమ్మద్ కాసిం గారు, నన్ను వెంట ఉండి నడిపించిన ఎం పీ జే రాష్ట్ర అధ్యక్షులు కె ఎమ్ అబ్దుల్ సుభాన్ గారు ,రాష్ట్ర ార్యవర్గ సభ్యులు, కర్నూల్, నంద్యాల, నందికొట్కూరు, బనగానపల్లె, ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం ఎంపీజే శాఖల పట్టణ అధ్యక్షులు, సభ్యులు ఎమ్మిగనూరు పట్టణ విద్యార్థి, యువజన సంఘాల నాయకుల ప్రోత్సాహం , కర్నూలు జిల్లా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఆ సమస్యలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసినందుకు గాను ఈరోజు నన్ను జిల్లా ఉత్తమ అవార్డు మెమొంటోను పురస్కరించడం జరిగింది . నాకు సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలిపారు.