జగనన్న ప్రభుత్వంలోనే ముస్లిం మైనారిటీలకు భద్రత
మరోసారి ఎమ్మెల్యేగా శ్రీదేవమ్మను గేలిపించుకుందాం..
పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరియు ముస్లిం మైనార్టీ మండల కన్వీనర్ గట్టు ఆరిఫ్
కర్నూలు ప్రతినిధి/ పత్తికొండ/ వెల్దుర్తి, మే 08, (సీమకిరణం న్యూస్) :
ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీలకు భద్రత ఉంటుందని పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరియు ముస్లిం మైనార్టీ మండల కన్వీనర్ గట్టు ఆరిఫ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వెల్దుర్తి పట్టణంలోని పలు వార్డుల్లో ముస్లిం మైనార్టీల ఇళ్ల వద్దకు వెళ్ళి వైసిపి ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గట్టు ఆరిఫ్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ సోదరులు ఎన్డీఏ కూటమికి ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని, ఒకటి పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి, రెండవ ఓటు కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్యకి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్టించడం ఖాయమన్నారు. మరొక్కసారి ప్రజలందరూ పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మను ఆశీర్వదించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం యువకులు తదితరులు పాల్గొన్నారు.