జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందాం…
జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందాం…
టిడిపి నేతలకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
వెల్దుర్తి పట్టణంలో వైసిపి భారీ ర్యాలీ
జనంతో కిటకిటలాడిన వెల్దుర్తి పట్టణం
జనసముద్రం అంటే ఎట్లా ఉంటాదో.. వెల్దుర్తి వైసిపి ర్యాలీ అలా ఉందని చర్చించుకుంటున్న వెల్దుర్తి మండల ప్రజలు
ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి సంపూర్ణ మద్దతు తెలిపిన వెల్దుర్తి మండల ప్రజలు
కర్నూలు ప్రతినిధి/ పత్తికొండ/ వెల్దుర్తి, మే 11, (సీమకిరణం న్యూస్) :
జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందామని ఎన్నికల్లో టిడిపి నేతలకు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో వెల్దుర్తి పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారికి మద్దతుగా రైతులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. రోడ్ షో వెంట రైతులు ట్రాక్టర్ల పై వచ్చి ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీలో సర్పంచులు, జడ్పిటిసి, ఎంపిటిసిలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేశారు. దీంతో వెల్దుర్తి పట్టణం జనంతో కిటకిటలాడింది. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి అభిమానులు కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సభను ఉద్దేశించి మాట్లాడుతూ కళ్ళు ఉండి కూడా గుడ్డివారి కంటే హీనంగా ప్రవర్తించే టిడిపి నేతలకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని వెల్దుర్తి మండలంలో కేవలం 5 సంవత్సరాల పాలనలో చేసి చూపించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఎన్నో ఏళ్ళు వెల్దుర్తి పట్టణాన్ని వేధిస్తున్న తాగునీటి సమస్యను మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించి పరిష్కరించడంతో పాటు 12 కోట్ల వ్యయంతో రామళ్లకోట రహదారిని పూర్తిచేసి, రోడ్డు సౌకర్యం గ్రామాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూర్తి చేసామన్నారు. వెల్దుర్తి పట్టణంలో దాదాపుగా 7 కోట్ల రూపాయలతో 30 పడకల ఆసుపత్రిని నిర్మించలేదా అన్నారు. ఎన్నో గ్రామాలకు రహదారులు మా ప్రభుత్వంలో ఇది అభివృద్ధి కదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి చేయకపోగా అనవసరమైన నిందలు వేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్న టిడిపి నేతలకు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా తమ కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీదేవి తనయుడు కంగాటి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మా అమ్మ కంగాటీ శ్రీదేవమ్మ కు, ఒక ఓటు ఎంపి అభ్యర్థి బి వై రామయ్య మరొక ఓటు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ ముత్యాల శైలజ, మండల కన్వీనర్ రవి రెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్ సమీర్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి సుంకన్న, పట్టణ ప్రెసిడెంట్ వెంకట నాయుడు, మైనార్టీ నాయకుడు గట్టు ఆరిఫ్ మరియు మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..