ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకోవడం ప్రజలందరి బాధ్యత
జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన
కర్నూలు కలెక్టరేట్, మే 12, (సీమకిరణం న్యూస్):
మే 13వ తేదిన ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు…త్రాగు నీరు, షేడ్స్, వికలాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేశామన్నారు..పోలింగ్ కేంద్రాలకు వచ్చే వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలుగా ఉన్న ఓటర్లకు తగిన సహకారం అందించేందుకు ఎన్ఎస్ఎస్, ఎన్ సి సి, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాలకు చెందిన సహాయకులను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. వీరు త్వరితగతిన ఓటు హక్కు వినియోగించుకునేలా సహాయకులు తోడ్పడతారని తెలిపారు.. వికలాంగుల కోసం. ప్రతి పోలింగ్ స్టేషన్ లో వీల్ చైర్స్ ఏర్పాటు చేశామన్నారు…సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీసు బలగాల ద్వారా భద్రత కల్పించడం జరుగుతోందని, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ రోజున వర్షం వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు వీలైనంత త్వరగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకోవడం ప్రజలందరి బాధ్యత అని, సోమవారం జరగబోయే ఎన్నికల పండుగ లో ఓటర్లు అందరూ పాల్గొనాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు..జిల్లాలో ఉన్న ఓటర్లు అందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు