ANDHRABREAKING NEWSSTATEWORLD
యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు గా వెంకట సుబ్బారెడ్డి
యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు గా ఏకగ్రీవ ఎన్నికైన వెంకట సుబ్బారెడ్డి
డోన్ టౌన్, మార్చి 14, (సీమకిరణం న్యూస్) :
అనంతపురం లో జరిగే యూటీఎఫ్ 16 వ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ నిర్మాణం ఏర్పాటు లో భాగంగా కర్నూలు జిల్లా, డోన్ నుండి నిరంతర సేవలందించిన వెంకట సుబ్బారెడ్డి రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు గా ఏకగ్రీవం గా ఎన్నికైనట్లు రాష్ట్ర సహాద్యక్షులు సురేష్ కుమార్ గారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్ డివిజన్ లోని ఉపాధ్యాయులకు నిరంతరం సేవలందిస్తూ, జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్.ఎస్.బాబు గారితో కలిసి యూటీఎఫ్ కు ఎనలేని సేవలందించిన వెంకట సుబ్బారెడ్డి అభినందనలు తెలియజేశారు.