మల్లెపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ
తెదేపా కార్యకర్త రాజుపై వైకాపా వర్గీయుల దాడి
రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు
విచారించి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
కర్నూలు ప్రతినిధి /పత్తికొండ/ వెల్దుర్తి, మే 13, (సీమకిరణం న్యూస్):
వెల్దుర్తి మండలంలోని మల్లెపల్లి గ్రామంలో సోమవారం శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇరు వర్గాల నాయకులు గ్రామంలో వాగ్వివాదానికి దిగారు. ఈ తరుణంలో తెదేపా కార్యకర్త రాజుపై వైకాపా వర్గీయులు దాడికి దిగారు. ఈ దాడిలో రాజు తలకు రక్త గాయాలు అయినట్లు తెలిసింది. దీంతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న సిఐ, ఎస్సైలు పోలీసు సిబ్బందితో అక్కడకు చేరుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఈ ఘటనపై బాధితుని ఇంటి వద్దకు వెళ్లి విచారించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలింగ్ బూతులకు వెళ్లి శాంతియుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పోలీసు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ, వెల్దుర్తి ఎస్సై చంద్రశేఖర్రెడ్డి. ఎస్బి హెడ్ కానిస్టేబుల్ ఖాజాహుస్సేన్. హెచ్ సి సుధాకర్. పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.