ANDHRABREAKING NEWSSTATEWORLD
పందుల తరలింపుకు గడువు ఇవ్వండి
పందుల తరలింపుకు గడువు ఇవ్వండి
డోన్ టౌన్, మార్చి 14, (సీమకిరణం న్యూస్) :
డోన్ పట్టణం నుంచి దూరంగా పందుల తరలింపుకు గడువు ఇవ్వాలని పందుల పెంపకం దారుల ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మోట రాముడు కోరారు.
సోమవారం మున్సిపల్ సమావేశ భవనంలో పందుల పెంపకం దారుల తో మున్సిపల్ కమిషనర్ కె. ఎల్. ఎన్ రెడ్డి, చైర్ పర్సన్ సప్త శైల రాజేష్, పట్టణ సీఐ మల్లికార్జునలు సమావేశమయ్యారు. 20 రోజుల్లోగా పందులను పట్టణానికి దూరంగా తరలించుకోవాలని అధికారులు సూచించారు. రెండు నెలల వ్యవధిలో పూర్తిగా తమ పందులను పట్టణంలో తిరగకుండా దూరంగా తరలించుకుంటామని పందుల పెంపకం దారులు నరసింహ, మహేష్, శేఖర్, దివాకర్ ఎరుకల నారాయణ ఎరుకల మద్దిలేటి పాగోలు మద్దిలేటి కోరారు. తమకు పందుల పెంపకానికి పట్టణ సమీపంలో అనువైన స్థలాన్ని అధికారులు చూపించాలని ఈ మేరకు డిమాండ్ చేశారు.