కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డా.ప్రభాకర్ రెడ్డి
బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి
ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రభాకర్ రెడ్డి
కర్నూలు ప్రతినిధి, మే 31, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్ గా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిని ప్రక్షాళన చేస్తానని తెలియజేశారు. ఆసుపత్రిలో సమస్యలు ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. అనంతరం సెక్యూరిటీ మరియు శానిటేషన్, పేస్ట్ కంట్రోల్ పై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల అడిషనల్ డీఎంఈ & ప్రిన్సిపాల్, డా. చిట్టి నరసమ్మ, సి ఎస్ ఆర్ ఎమ్ ఓ , డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సి ఎస్ ఆర్ ఎమ్ ఓ, డా.హేమనళిని, ఆర్ ఎం ఓ డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివ బాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, ఆసుపత్రి ఏడి, శ్రీ.అనిల్ కుమార్ రెడ్డి, మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.