
ప్రజలకు సేవకుడిలా పనిచేస్తా : కేఈ శ్యామ్ బాబు
కర్నూలు ప్రతినిధి /పత్తికొండ, వెల్దుర్తి, జూన్ 04, (సీమకిరణం న్యూస్):
నన్ను ఆశీర్వదించి పత్తికొండ ఎమ్మెల్యేగా గెలిపించిన పత్తికొండ నియోజకవర్గ ప్రజలకు సేవకుడిలా పనిచేస్తానని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ. శ్యామ్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలిపించిన పత్తికొండ నియోజకవర్గం ప్రజలకు, తన గెలుపు కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.