ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTS

ఎన్నికల విధుల్లో అందరి కృషి అభినందనీయం

ఎన్నికల విధుల్లో అందరి కృషి అభినందనీయం …

కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్

పోలీంగ్, కౌంటింగ్ బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి , కేంద్ర, రాష్ట్ర బలగాలు, ఇతర శాఖల అధికారుల కృషి, సేవలకు అభినందనలు … జిల్లా ఎస్పీ

కర్నూలు క్రైమ్, జూన్ 05, (సీమకిరణం న్యూస్):

పోలీంగ్, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించిన అన్ని వర్గాల ప్రజలు , రాజకీయ పార్టీలు, మీడియా కి ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల పోలీంగ్, కౌంటింగ్ లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా పోలీసు యంత్రాంగం, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు ( SSB అస్సాం , SSB గుజరాత్ , SAP గుజరాత్, CRPF, BSF, గ్రేహౌండ్స్, APSP, కేరళ SAP, కర్నాటక పోలీసులు, హోంగార్స్డ్, SAR అంబర్ పేట పోలీసులు,SDRF, SPF ) మరియు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాగా పని చేసి విజయవంతంగా పూర్తి చేశారని , అందుకుగాను అభినందనలు తెలియజేస్తున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీంగ్, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించినందుకు గాను అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, మిడియా కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర , పోలీసు బలగాలతో పాటు అన్ని శాఖల ఉద్యోగులు కలిసి కట్టుగా సమర్ధవంతంగా విధులు నిర్వహించడం లో అందరి కృషి ఉందన్నారు. ఎన్నికల విధుల్లో బాగా పని చేసిన కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ బాగా పని చేశారని హోంగార్డు స్ధాయి నుండి అడిషనల్ ఎస్పీ స్ధాయి వరకు ప్రతి ఒక్కరూ నిర్విరామంగా కృషి చేశారని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ కొనియాడారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!