రాష్ట బడ్జేట్ లో వెయ్యు కోట్లు కేటాయించాలి : చేనేత కార్మికుల
చేనేత కార్మికులకు రాష్ట బడ్జేట్ లో వెయ్యు కోట్లు కేటాయించాలి
చేనేత కార్మికుల సంఘం డిమాండ్
కోడుమూరు , మార్చి 14 , ( సీమకిరణం న్యూస్ ) :
చేనేత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో చేనేత నాయకులు జిపి. వీరన్న అధ్యక్షతన తహాసీల్దారు కార్యాలయం ముందు దర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ సంఘం జిల్లా అద్యక కార్యదర్శులు కె.లక్ఛన్న, కె.రాజు గార్లు పాల్గొని వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి కేవలం 200 కోట్లుకేటాయించి చేయి దులుపుకుంది. ప్రస్తుత బడ్జేట్ అదికారుల జీత బత్యాలకే సరిపోతుంది చేనేత కార్మికులకు ఎలాంటి న్యాయం జరగదు నేతన్న నేస్తం చాలా మంది అర్హులకు రాలేదు. సోంత మగ్గం లేక బయట నేసేవాల్లు నికాసైన కార్మికులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం అలాంటి వారికి న్యాయం జరుగలేదు. కొంతమందికి చేనేత గుర్తింపు కార్డులు లేవు దాదాపుగా 10 సం,రాల నుండి గుర్థంపు కార్డులు ఇవ్వలేదు.దీనివల్ల అర్హత వున్న వాల్లు పెన్షన్ కోల్పోతున్నారు.గతంలో .ఐసిఐసిఐ వారి హెల్త్ కార్డు వుండేది చిన్నాచితక రోగాలోస్తే ఉచితంగా చూపించు కునే అవకాశం వుండేది అదికాస్తా రద్దుచేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఆదుకోవడంలో విఫలమైయాయి మనిషి మనుగడ కొనసాగాలంటే కూడు గుడ్డ అవసరం ఇవిరెండులేకపోతే.మనిషి బ్రతుకలేడుఅలాంటిదిరైతు.చేనేత.కార్మికులను.ఆదుకోవడంలో విఫలమైపోయాయి చేనేత కార్మికుడు వేసిన చీరకు గిట్టుబాటు ధర లేక కుటుంబాన్ని పోషించలేక పని మానేసి ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు ఎందుకంటే ముడిసరుకు రేట్లు పెరగడం అందుకు జీఎస్టీ పెద్దఎత్తున వేయడం చేనేత కార్మికులకు కోలుకోలేని దెబ్బ పడింది రోజురోజుకు ప్రభుత్వాలు పవర్లూమ్స్ కు ప్రాధాన్యతనిస్తూ హ్యాండ్లూమ్స్ ను పడగొట్టారు అందువల్ల చాలామంది ఇది కార్మికులు కుటుంబాలను పోషించలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించి కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారన్నారు అలాగే ప్రతి చేనేత కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు మరియు మగ్గం షెడ్డు నిర్మించాలని ముడిసరుకు పై జిఎస్టి ఎత్తివేయాలని పనిచేస్తున్న ప్రతి కార్మికునికి నేతన్న నేస్తం అమలుచేయాలని చేనేత గుర్తింపు కార్డు పునరుద్ధరించాలని చేనేత కార్మికులకు బ్యాంకుల ద్వారా డైరెక్ట్ ముద్ర లోన్ లక్ష రూపాయలు ఇవ్వాలని సొంత స్థలం ఉన్న చేనేత కార్మికునికి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షలు ఇవ్వాలని అర్హత ఉన్న ప్రతి కార్మికునికి పెన్షన్ ఇవ్వాలని అలాగే.చే నేత కార్మికుడు నేసిన చీరకు ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పించి. కోడుమూరు ప్రాంతంలో టెక్స్ టైల్. పార్క్ నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని స్పందన కార్యక్రమం లో డిప్యూటీ తాసిల్దార్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గపూర్ మియా మును స్వామి గిడ్డయ్య శేఖర్ బుడ్డ ప్ప మాసూం వలి తదితర చేనేత కార్మికులు పాల్గొన్నారు