ఎమ్మెల్యే టీజీ భరత్ ను శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ శంకర్ శర్మ
కర్నూలు ప్రతినిధి, జూన్ 07, (సీమకిరణం న్యూస్):
సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన టిడిపి ఎమ్మెల్యే టీజీ భరత్ కు డాక్టర్ శంకర్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కర్నూలులో ఎన్నో సేవా కార్యక్రమాలు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే టీజీ భరత్ కర్నూలులో క్రీడలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిని ఘనంగా నిర్మిస్తున్నారంటే వీళ్ళ ప్రోత్సాహమే అని అన్నారు. నా వంతు సహాయం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి ముందుకు పోవడం జరుగుతుంది క్రీడా సంఘాలకు అనాధశాలకు వృద్ధులకు నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. క్రీడల విద్యార్థులకు. ప్రతి ఒక్కరికి సాయం అందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.